Sun Aug 07 2022 20:01:38 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ప్రియులకు భారీ షాక్

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అందుకే ధర తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చేయాలి. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలుంటాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి పన్ను 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం వంటి నిల్వలు బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా మారతాయని మార్కెట్ నిపుణులు చెబుతారు.
తగ్గిన వెండి...
ఈరోజు బంగారం ధరలు దేశంలో భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 1,300 రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,850 రూపాయలుగా ఉంది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ లో కిలో వెండి ధర 65.000 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై రూ.1200లు, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై రూ.1,310 లు పెరిగింది.
Next Story