Tue Dec 09 2025 10:14:38 GMT+0000 (Coordinated Universal Time)
తగ్గని కరోనా... పెరుగుతున్న పాజిటివిటీ రేటు
తాజాగా భారత్ లో 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పది మంది మరణించారు

ఇండియాలో కరోనా కేసులు తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు కూడా ఎనిమిది వేల కేసులు నమోదయ్యాయి. తాజాగా 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పది మంది మరణించారు. నిన్న కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,592గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కోలుకున్న వారి సంఖ్య 98.68 శాతంగా ఉంది.
యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ భారత్ లో 4,32,22,861కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 5,24,771 మంది ఇప్పటి వరకూ భారత్ లో మరణించారు. ప్రస్తుతం 47,995 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,26,57,335 గా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగం అందుకుంది. ఇప్పటి వరకూ 1,95,19,81,150 డోసుల పంపిణీ జరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Next Story

