Mon Dec 29 2025 06:03:46 GMT+0000 (Coordinated Universal Time)
దక్షిణ మధ్య రైల్వే శాఖకు భారీగా ఆదాయం
ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే శాఖకు భారీగా ఆదాయం వచ్చింది.

ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అత్యధికంగా ఆదాయం వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది నవంబరు నెల వరకూ దక్షిణ మధ్య రైల్వే కు 19.314 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడిచంారు. జనవరి నుండి నవంబర్ వరకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని తెలిపారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు...
గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా ఆదాయం లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది 18,831 కోట్ల రూపాయలు ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే శాఖకు ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 483 కోట్లు ఎక్కువ ఆదాయం వచ్చిందని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. మరొకవైపు సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.
Next Story

