Fri Dec 05 2025 14:59:25 GMT+0000 (Coordinated Universal Time)
నేటి మధ్యాహ్నం జీరో షాడో
ఈరోజు మధ్యాహ్నం మనిషి నీడ మాయమవుతుంది. రెండు నిమిషాల పాటు ఈ అద్భుతం జరగనుంది

ఈరోజు మధ్యాహ్నం మనిషి నీడ మాయమవుతుంది. రెండు నిమిషాల పాటు ఈ అద్భుతం జరగనుంది. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ రెండు నిమిషాల పాటు ప్రతి రోజూ మధ్యాహ్నం నీడ మాయమవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని జీరో షాడోగా అంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోనే జీరో షాడో కనిపిస్తుందని తెలిపారు.
ఈ కారణంతోనే...
సూర్యకాంతి లంబంగా మన మీద పడటంతో నీడ మాయమవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయంలో సూర్యుడి స్థానం ఉత్తర, దక్షిణ దిశల్లోకి మారుతుంటుందని, ఏటా రెండు సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని వారు వివరించారు ఈ కారణంగానే మధ్యమహ్న సమయంలో సూర్యకిరణాలు భూమిపై లంబంగా పడతాయని తెలిపారు. అందువల్లనే జీరో షాడో ఏర్పడుతుంది చెప్పారు.
Next Story

