Sat Dec 13 2025 22:27:59 GMT+0000 (Coordinated Universal Time)
Jammu and Kashmir : భారీ వర్షాలతో ముప్ఫయి మంది మృతి
వైష్ణో దేవీ యాత్ర మార్గంలో ఆకస్మిక వరదలకు కొండచరియలు విరిగిపడి దాదాపు మంది యాత్రికులు మరణించారు.

జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాత్రాలోని వైష్ణో దేవీ యాత్ర మార్గంలో ఆకస్మిక వరదలకు కొండచరియలు విరిగిపడి దాదాపు ముప్ఫయి మంది యాత్రికులు మరణించారు. మరో 23 మందికి గాయాలయ్యాయని చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు తెలిపారు.
కొండచరియలు విరిగిపడటంతో...
ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న మెరుపు వరదలతో కొండ చరియలు విరిగిపడటంతో వైష్ణోదేవీ ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారరు. ఆర్మీ, ఎన్.డి.ఆర్.ఎఫ్ రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. చాలాచోట్ల రోడ్లు, వంతెనలు, పవర్ లైన్లు, టవర్స్ ధ్వంసమై జనజీవనం స్తంభించింది. మరోవైపు రావి, చినాబ్, తావి, బియాస్ నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పునరావావస కేంద్రాలను ఏర్పాటు చేసి కొందరిని అక్కడికి తరలించారు.
Next Story

