Thu Mar 19 2026 15:32:45 GMT+0530 (India Standard Time)
Eclipses : ఈ నెలలోనే రెండు గ్రహణాలు
ఈ నెలలో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. ఒకటి చంద్ర గ్రహణం కాగా, మరొకటి సూర్యగ్రహణం

ఈ నెలలో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. ఒకటి చంద్ర గ్రహణం కాగా, మరొకటి సూర్యగ్రహణం. ఈ ఏడాది ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయని పండితులు చెబుతున్నారు. మార్చి 14వ తేదీన మొడటి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. పథ్నాలుగో తేదీన పౌర్ణమి తిధి రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది ఉదయం పూట ఏర్పడుతుంది కాబట్టి భారత్ లో ప్రజలు చూసే అవకాశం లేదు.
29న సూర్యగ్రహణం...
మామూలుగా గ్రహణం సమయంలో శుభకార్యాలను నిర్వహించరు. ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో ఈ నెలలో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. మార్చి 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుందని తెలిపారు. అమావాస్యరోజున ఈ గ్రహణం ఏర్పడనుండటంతో ఇది కూడా భారత్ ప్రజలకు కనిపించే అవకాశం లేదని, కేవలం ఉత్తర అమెరికా, గ్రీన్ లాండ్, ఐస్ లాండ్, యూరప్ ప్రాంత ప్రజలకు మాత్రమే కనిపిస్తుందని చెప్పారు.
Next Story

