Sat Dec 13 2025 19:31:40 GMT+0000 (Coordinated Universal Time)
UPI : ఆగస్టు నుంచి యూపీఐలో మార్పులు ఇవే
ఆగస్టు నెల నుంచి యూపీఐ చెల్లింపుల్లో మార్పులు రానున్నాయి. ఈ

ఆగస్టు నెల నుంచి యూపీఐ చెల్లింపుల్లో మార్పులు రానున్నాయి. ఈ మార్పులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. ఈ మార్పులు యూపీఐ సర్వర్‌పై భారం తగ్గించడం, లావాదేవీల వేగం పెంచడం, సేవల్లో అంతరాయం లేకుండా చేయడం లక్ష్యంగా తీసుకున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రతి రోజూ గరిష్టంగా యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకే యాప్ అయినా, వేరే యాప్‌లు అయినా కలిపి ఉంటుందని తెలిపింది. మొబైల్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల సమాచారం రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే చూసేందుకు వీలుంటుంది.
లావాదేవీల స్టేటస్...
పెండింగ్ లో ఉన్న లావాదేవీ స్టేటస్ రోజుకు మూడు సార్లు మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేయడాన్ని మధ్య కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాల్సి ఉంటుంది. ఆటోపే అంటే నెట్ ఫ్లిక్స్, ఈఎంఐ, ఎస్ఐపీల వంటి లావాదేవీలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ప్రాసెస్ కావు. . కొత్త బ్యాంక్ ఖాతాను యూపీఐ యాప్‌కి లింక్ చేయాలంటే మరింత కఠినమైన ధృవీకరణ ఉంటుందని కొత్త నిబంధనలు వెల్లడిస్తున్నాయి.
సాధారణ వినియోగదారులకు...
ఈ కొత్త తరహా నిబంధనలు తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసే వారు, ఆటోపేలు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే గమనించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సాధారణంగా వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. . ఈ మార్పులు వల్ల యూపీఐ సేవలు మరింత వేగంగా, నమ్మకంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నిబంధనల వల్ల అదనపు రుసుం ఏమీ పడదని, పరిమితికి మించి వినియోగిస్తే మాత్రం అంతరాయం నిపుణులు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Next Story

