Fri Dec 05 2025 10:48:09 GMT+0000 (Coordinated Universal Time)
Encounter : జార్ఖండ్ లో ఎన్కౌంటర్ .. నలుగురు మావోల మృతి
జార్ఖండ్ లో భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మరణించారు

జార్ఖండ్ లో భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మరణించారు. అటవీ ప్రాంతంలో వరస ఎన్కౌంటర్లతో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా భద్రతాదళాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు ఒకరిపై ఒకరు ప్రారంభించుకున్నారని తెలిపారు.
ఆయుధాలు స్వాధీనం...
అయితే భద్రతాదళాల చేతిలో నలుగురు మావోయిస్టులు మరణించారని జిల్లా ఎస్పీ అశుతోష్ శేఖర్ మీడియాకు తెలిపారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో ిఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన మావోయిస్టుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story

