Thu Mar 19 2026 16:24:35 GMT+0530 (India Standard Time)
ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తుండగా ఒక్కసారి...?
కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తుండగా గ్యాలరీ విరిగి పడటంతో 60 మందికి గాయాలయ్యాయి.

కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తుండగా గ్యాలరీ విరిగి పడటంతో 60 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేరళలోని వాండోర్ లో తాత్కాలికంగా ఫుట్ బాల్ స్టేడియంను ఏర్పాటు చేశారు. వాండోర్, కలికావు సమీపంలో పూన్ గోడు అనే గ్రామంలో ఈ స్టేడియంను ఏర్పాటు చేశారు.
60 మందికి గాయాలు....
అయితే మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారి గ్యాలరీ కూలిపోయింది. దీంతో ప్రేక్షకులంతా స్టేడియం బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. ఈ తొక్కిసలాటలో గాయాలయ్యాయి. స్థానికులే ఈ మ్యాచ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

