Fri Dec 05 2025 15:54:22 GMT+0000 (Coordinated Universal Time)
Kerala : కేరళలలోని ఆలయంలో టపాసులు పేలి 150 మందికి గాయాలు
కేరళలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 150 మంది గాయపడగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

కేరళలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 150 మంది గాయపడగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. నీలగిరిపురం ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిసింది. కేరళలోని ఒక ఆలయలో నిల్వ ఉంచిన బాణ సంచా పేలుడుతో ఒక్కసారిగా భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. తొక్కిసలాటకు గురై కొందరు, బాణా సంచా ప్రమాదంలో మరికొందరు గాయపడి చికిత్స పొందుతున్నారు.
కొందరి పరిస్థితి విషమం...
గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆలయంలో దీపావళి టపాసులను నిల్వ ఉంచడంపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.
Next Story

