Thu Mar 19 2026 10:30:05 GMT+0530 (India Standard Time)
జార్ఘండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పద్దెనిమిది మంది గాయాలపాలయ్యారు. వీరంతా కూలీలుగా గుర్తించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని హరిహరగంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూలీలతో వెళుతున్న ట్రక్కు ఎదరుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పాలం జిల్లాలోని పంకికి చెందిన కూలీలు బీహార్ లోని సిహుడి గ్రామంలో వరికోతలకు వెళ్లారు.
అంతా కూలీలే....
వరికోతలు పూర్తయిన తరవాత తిరిగి తమ గ్రామానికి పికప్ వ్యాన్ లో వస్తున్నారు. వీరంతా బీహార్ లోని ఔరంగాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. ముగ్గురు ప్రమాద స్థలంలో మరణించగా, మరో ముగ్గురు మహిళలు చికిత్స పొందుతూ మరణించారని పోలీసు అధికారులు తెలిపారు. గాయాల పాలైన 12 మంది కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story

