Fri Dec 05 2025 19:42:32 GMT+0000 (Coordinated Universal Time)
GST : జీఎస్టీ శ్లాబ్ ల మార్పులతో భారీగా తగ్గే వస్తువులివే.. జీరో జీఎస్టీ ఉన్న వస్తువులు ఏంటో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ శ్లాబులు అమలులోకి వచ్చేందుకు మరో వారం రోజుల సమయం ఉంది. అయితే మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కలిగించేలా ఈ జీఎస్టీ శ్లాబులున్నాయన్న అంచనాలు వినిపస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ శ్లాబులు అమలులోకి వచ్చేందుకు మరో వారం రోజుల సమయం ఉంది. అయితే మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కలిగించేలా ఈ జీఎస్టీ శ్లాబులున్నాయన్న అంచనాలు వినిపస్తున్నాయి. నాలుగు శ్లాబ్ ల నుంచి రెండు శ్లాబ్ లకు తగ్గించింది. దీంతో పాటు అసలు జీఎస్టీ పడకుండా కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ డబ్బు ఆదా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఐదు నుంచి పద్దెనిమిది శాతం ఉన్న శ్లాబ్ లను పూర్తిగా తొలగించారు. తాజా నిర్ణయంలో ఇక పన్నెండు, ఇరవై ఎనిమిది శాతం శ్లాబులను మాత్రమే ఉంచారు. దీంతో పాటు ఐదు శాతం శ్లాబుల్లో ఉన్న ఉత్పత్తులపై జీరో ట్యాక్స్ విధించనున్నారు.
జీఎస్టీ పడని వస్తువులివే...
పాలు, పాల ఉత్పత్తులపై ఇక ఎలాంటి జీఎస్టీ పడదు. దీంతో పాటు విద్యార్థులు ఉపయోగించే పెన్సిళ్లు, షార్ప్ నర్లు, క్రేయాన్స్, రంగులు, మ్యాప్ లు, ఛార్లులు, గ్లోబ్ లపైన కూడా ట్యాక్ ఉండదు. దీంతో పాటు వివిద రకాల మందులపై ఉన్న జీఎస్టీని కూడా తొలగిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ వంటి వ్యాధులతో పాటు మరో ముప్ఫయి మూడు రకాల మందులపై జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అలాగే ఆరోగ్య బీమా పాలసీలపై కూడా జీరో ట్యాక్స్ విధించారు. దీంతో పాటు ధర్మామీటర్లు, ఆక్సిజన్, బ్యాండేజీలు, డయాగ్నొస్టిక్ కిట్ లు, వైద్య పరికరాలపై ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ వేయకూడదని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
ధరలు తగ్గే వస్తువులివే...
తాజాగా జీఎస్టీ తీసుకున్న నిర్ణయంతో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా వెన్న, నెయ్యి, చీజ్, జామ్, పాస్తా, మిఠాయిలు, బాదం, జీడిపప్పు, ఖర్జూరం వంటి వాటిపై జీఎస్టీని ఐదు శాతానికి మాత్రమే పరిమితం చేశారు. కూరగాయలు, మాసం, చేపఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి. ఇక హెయిర్ ఆయిల్, టూత్ పేస్టులు, షాంపూలు, సబ్బులు, షేవింగ్ క్రీంలు, బ్లేడ్లు, టాల్కం పౌడర్, టూత్ బ్రష్ లు కూడా ఐదు శాతానికి తగ్గించడంతో వీటి ధరలు కూడా భారీగానే తగ్గనున్నాయి. ఇక నిత్యం వినియోగించే వస్త్రాలు, చెప్పులు, షూలు ధరలకు కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి జీఎస్టీని తగ్గించారు.
Next Story

