Tue Jan 20 2026 18:32:00 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీలో అదే సీన్... విమానాల రాకపోకలు ఆలస్యం
ఢిల్లీలో భారీగా పొగమంచు ఉంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు

ఢిల్లీలో భారీగా పొగమంచు ఉంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో పొగమంచు విపరీతంగా ఉంది. ప్రజలు ఉదయం బయటకు రావాలంటేనే భయపడి పోతున్నారు. వాహనదారులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. పట్టపగలే హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. పొగమంచు ఉదయం తొమ్మిది గంటలయినా వీడటం లేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు వారీ పనులకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు.
బయటకు రాలేక...
మరోవైపు చిరు వ్యాపారులు కూడా ఢిల్లీలో పొగమంచు కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. ఇక విమానాల రాక పోకలు పూర్తిగా ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రైళ్లు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రజలు ఈ పొగమంచులో బయటకు వస్తే శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశముందని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీలోని పలు వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Next Story

