Wed Jan 28 2026 21:04:10 GMT+0000 (Coordinated Universal Time)
Loksabha Speaker : స్పీకర్ ఎన్నిక అనివార్యమయ్యేటట్లుందిగా?
లోక్సభ స్పీకర్ పదవిపై క్లారిటీ వచ్చింది. ఎన్డీఏ తరుపున ఓం బిర్లా నామినేషన్ వేయనున్నారు

లోక్సభ స్పీకర్ పదవిపై క్లారిటీ వచ్చింది. ఎన్డీఏ తరుపున ఓం బిర్లా నామినేషన్ వేయనున్నారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని భావించి రాజ్నాథ్ సింగ్ మల్లికార్జున ఖర్గేను కలసి కోరారు. అయితే స్పీకర్ పోస్టు ఎన్డీయే తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇండియా కూటమికి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంచారు. అయితే ఈ ప్రతిపాదనకు ఎన్డీయే అంగీకరించకపోవడంతో రెండు కూటముల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమయ్యేలా ఉంది.
ఇద్దరు పోటీలో...
ఎన్డీఏ కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా నామినేషన్ వేయనుండగా, ఇండియా కూటమి నుంచి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సురేష్ నామినేషన్ వేయనున్నారు. కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సురేష్ పేరును ఇండియా కూటమి ఖరారు చేయడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో స్పీకర్ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్లు పడితే రేపు ఎన్నిక జరిగే అవకాశముంది. బలాబలాలను చూసుకుంటే కొంత ఎన్డీఏకు ఆధిక్యం ఉన్నప్పటికీ ఎన్నిక మాత్రం ఉత్కంఠగా మారే అవకాశముంది.
Next Story

