Thu Mar 19 2026 12:14:44 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 27,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసుల ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 27,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 284 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,43,45,945 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,22,801 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాల సంఖ్య....
భారత్ లో ఇప్పటి వరకూ 3,93,36,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,81,802మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,48,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
ఒమిక్రాన్ కేసులు....
కాగా ఒమిక్రాన్ కేసులు కూడా భారత్ లో పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 460 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 351 కేసులు నమోదయ్యాయి.
Next Story

