Thu Mar 19 2026 18:59:56 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల భారీగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 2,82,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 441 మంది మరణించారు.

భారత్ లో కరోనా కేసుల భారీగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 2,82,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 441 మంది మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,82,42, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం దేశంలో 18,31,000 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,11,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,86,251 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,58,88,66,674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 8,961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 15.03 శాతంగా ఉంది.
Next Story

