Thu Mar 12 2026 13:23:27 GMT+0530 (India Standard Time)
హర్మూజ్‌లో అనుమతి.. భారత్‌కు భారీ ఊరట?
పశ్చిమాసియాలో యుద్ధంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది.

పశ్చిమాసియాలో యుద్ధంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఆధీనంలోకి తీసుకోవడంతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ జెండాతో హర్మూజ్‌లో ప్రయాణించే నౌకలకు ఇరాన్ అనుమతించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
ఇద్దరు విదేశాంగ మంత్రులతో...
ఇప్పటికే భారత్‌కు చెందిన రెండు చమురు ట్యాంకర్లు సురక్షితంగా హర్మూజ్‌లో ప్రయాణించినట్లు సమాచారం. భారత్ విషయంలో ఇరాన్ పాజిటివ్ గా వ్యవహరించినట్లు కనిపించింది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ , ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్నీ మధ్య చర్చలు ఫలప్రదం కావడంతో భారత నౌకలను హర్మూజ్ జలసంధి మీదుగా ఇరాన్ అనుమతించినట్లు తెలుస్తోంది.
Next Story

