Fri Dec 05 2025 13:43:36 GMT+0000 (Coordinated Universal Time)
రాత మారింది.. గిరిజన కార్మికుడికి దొరికిన 40లక్షల వజ్రం
మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాలకు నిలయంగా ప్రసిద్ధి పొందింది.

మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాలకు నిలయంగా ప్రసిద్ధి పొందింది. కొన్ని లక్షల క్యారెట్ల వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించారు. అందుకే అక్కడ కూలీలు, కార్మికులు వజ్రాల వేట సాగిస్తుంటారు. తాజాగా ఓ గిరిజన కార్మికుడికి అదృష్టం వరించింది. మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో గిరిజన కార్మికుడు మాధవ్‌కి సుమారు 40 లక్షల విలువైన 11.95 క్యారెట్ల వజ్రం దొరికింది. కృష్ణ కల్యాణ పట్టి ప్రాంతంలోని ఓ గనిలో పని చేస్తుండగా అతను వజ్రాన్ని గుర్తించాడు. నిబంధనల ప్రకారం వజ్రాన్ని పన్నా డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేయగా, త్వరలో వేలం వేయనున్నారు. వచ్చిన డబ్బులో 12.5 శాతం రాయల్టీ తీసి మిగిలిన మొత్తాన్ని కార్మికుడికి అందించనున్నారు.
Next Story

