Sun Nov 03 2024 15:28:23 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రయాన్-3 దిగిన ప్రాంతం పేరు శివశక్తి: ప్రధాని మోదీ
చంద్రయాన్-3 లాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి గా నామకరణం చేశారు
చంద్రయాన్-3 లాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి గా నామకరణం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. గ్రీస్ నుండి బెంగళూరుకు చేరుకున్న ప్రధాని మోదీ. ఇస్రో శాస్త్రవేత్తల కోసం అభినందన సభలో ఏర్పాటు చేశారు. ఆ సభలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రయాన్-3లో మహిళల శక్తి ఎంతో ఉందని ప్రధాని ప్రశంసలు గుప్పించారు. విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నేరుగా బెంగళూరుకు వచ్చారు. విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులకు మోదీ అభివాదం చేశారు. చంద్రయాన్ - 3 విజయం పట్ల శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని.. ఇది అసాధారణ విజయమని అన్నారు. చంద్రుడిపై భారత్ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసిందని.. చంద్రయాన్ - 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందామని అన్నారు ప్రధాని మోదీ.
చంద్రయాన్ -2 వైఫల్యంతో భారత్ వెనకడుగు వేయలేదన్నారు ప్రధాని మోదీ. మరింత పట్టుదలతో పనిచేసి చంద్రయాన్ -3 ద్వారా విజయం దక్కించుకున్నామని అన్నారు. ప్రతి ఇంటిపైనే కాదు.. చంద్రుడిపైనా త్రివర్ణ పతాకం ఎగురుతోందని అన్నారుదీ. శాస్త్ర, సాంకేతికరంగాల్లో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందని మోదీ అన్నారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో నేను దక్షిణాఫ్రికాలో ఉన్నాను.. కానీ నా మనస్సు మీతో ఉందని శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. చంద్రయాన్-3 మిషన్ విజయం భారతదేశ అంతరిక్ష కార్యక్రమ చరిత్రలో ఒక అసాధారణ ఘట్టంగా ప్రధాని అభివర్ణించారు.
Next Story