14 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన కుమారుడు ఫేస్ బుక్ లో ప్రత్యక్షం
తల్లిదండ్రులకు బిడ్డ కనిపించకుండా పోతే ఆ బాధ వర్ణనాతీతం.

తల్లిదండ్రులకు బిడ్డ కనిపించకుండా పోతే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి తల్లిదండ్రులకు 14 ఏళ్ల తర్వాత ఓ ఫేస్ బుక్ వీడియోలో కొడుకు కనిపిస్తే!! పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా చంచల్ గ్రామానికి చెందిన మారుఫ్ అలీ, నురేజా బీబీ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. 20 ఏళ్ల క్రితం పెద్ద కుమారుడు, 14 ఏళ్ల క్రితం చిన్నకొడుకు చెప్పాపెట్టకుండా ఇంటి నుండి వెళ్లిపోయారు.
ఇటీవల ఓ ఫేస్బుక్ వీడియోను చూసి ఆ వృద్ధ దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మారుఫ్కు ఓ మిత్రుడు ఫోనులో ఉన్న వీడియో చూపించగా అందులో తమ చిన్న కుమారుడు నజీముల్ హక్ ఉన్నట్లు గుర్తించారు. వీడియోలో ఉన్న వ్యక్తి ప్రవర్తన, వయసు, శరీరంపై ఉన్న మచ్చ ఆధారంగా నజీముల్ అని గుర్తు పట్టారు. ఇప్పుడు అతడు బంగ్లాదేశ్‌లోని కామిల్లా జిల్లాలో ఉన్నాడు. కుమారుడిని తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని మారుఫ్ దంపతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

