Thu Dec 18 2025 12:00:14 GMT+0000 (Coordinated Universal Time)
పొగ మంచు అడ్డుకుంది
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరగాల్సిన నాలుగవ టీ20 మ్యాచ్ బాల్ పడకుండానే రద్దయింది.

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరగాల్సిన నాలుగవ టీ20 మ్యాచ్ బాల్ పడకుండానే రద్దయింది. అధిక పొగమంచు కారణంగా మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అనంతరం, మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా, పొగమంచు తగ్గుతుందేమోనని రాత్రి 9:30 గంటల వరకు వేచి చూశారు. చివరికి మ్యాచ్ నిర్వహించడం సాధ్యపడకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐదు టీ20ల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదవ టీ20 మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
Next Story

