Thu Jan 29 2026 20:30:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking- Blasts in Bengaluru: బెంగళూరులోని 'రామేశ్వరం కేఫ్' లో పేలుడు
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం

Breaking- Blasts in Bengaluru:బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం నాడు పేలుడు సంభవించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ బ్లాగర్లకు ఈ కేఫ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండేది. బెంగళూరులో ఈ కేఫ్ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. పేలుడు జరిగినప్పుడు కూడా రామేశ్వరం కేఫ్ లో భారీగా జనం ఉన్నారు. అయితే ఈ పేలుడు మరీ తీవ్రమైనది కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేలుడు వెనుక ఎవరి కుట్ర అయినా ఉందా.. లేక సిలిండర్ పేలుడు కారణంగా సంభవించిన అగ్నిప్రమాదమా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యపై తక్షణ సమాచారం లేనప్పటికీ, ఐదుగురిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయని పోలీసులు మీడియాకు తెలిపారు.
ఈ హోటల్ బెంగళూరులోని ఇందిరానగర్, జెపి నగర్, బ్రూక్‌ఫీల్డ్, రాజాజీనగర్ లో ఉంది. ఇటీవలే హైదరాబాద్‌లోని మాదాపూర్ లో కూడా ఓపెన్ చేశారు. పలువురు ప్రముఖులు కూడా బెంగళూరుకు వెళ్ళినప్పుడు రామేశ్వరం కేఫ్ లో టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఫుడ్ బ్లాగర్స్ కారణంగా చాలా తక్కువ సమయంలోనే ఈ కేఫ్ కు పాపులారిటీ వచ్చింది.
Next Story

