Thu Mar 19 2026 13:09:17 GMT+0530 (India Standard Time)
ఆత్మాహుతి దాడి.. ముగ్గురి జవాన్ల వీరమరణం
ఆర్మీ క్యాంప్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీర మరణం పొందారు

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరికి సమీపంలోని ఆర్మీ క్యాంప్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీర మరణం పొందారు. దీంతో ఆర్మీ అప్రమత్తమయింది. మరికొందరు జవాన్లు తీవ్ర గాయాల పాలయ్యారు. వారికి చికిత్స అందిస్తున్నారు.
ఇద్దరు ఉగ్రవాదుల హతం...
ఆర్మీ జవాన్లు ముగ్గురు వీరమరణం పొందిన ఘటనలో భద్రత దళాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుపెట్టారు. ఆకస్మికంగా ఆర్మీ క్యాంప్ పై ఆత్మహుతి దాడి చేయడంతో అక్కడ విషాదం అలుముకుంది. రాజౌరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ క్యాంప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతాదళాలు ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా? అని గాలింపు చర్యలు చేపట్టారు. అందరినీ అప్రమత్తం చేశారు.
Next Story

