Mon Dec 15 2025 20:22:48 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : మళ్లీ మోగిన సైరన్లు.. అలెర్ట్ గా ఉండాలంటూ...?
పాక్ - భారత్ ల మధ్య సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా కొన్ని రాష్ట్రాల్లో సైరన్లు మోగాయి

పాక్ - భారత్ ల మధ్య సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా కొన్ని రాష్ట్రాల్లో సైరన్లు మోగాయి. ఉదయం 9.30 గంటలకు చండీగఢ్ లో ఆర్మీ సైరన్ లు మోగించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఆ ప్రాంతంలో బ్లాక్ అవుట్ ను ప్రకటించినట్లు తెలిసింది. స్థానికులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. కనీసం బాల్కనీలలోకి కూడా రావొద్దని ఆర్మీ ప్రజలకు సూచించింది. పై కప్పులపైకి ఎవరూ చేరవద్దని తెలిపింది.
ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ...
ఈరోజు ఉదయం జమ్మూలోనూ సైరన్లు మోగాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు పాక్ దాడులు జరిపే అవకాశముందని భావించి ఆర్మీ ప్రజలకు ఈ రకమైన ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మరొకవైపు ఢిల్లీలోనూ హై అలెర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. ఇండియా గేట్ సమీపంలో సందర్శకులను, స్థానికులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

