పది నిమిషాల ఆలస్యం.. ఆమె ఫ్లైట్ ఎక్కలేకపోయింది
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ధ్రువీకరించింది. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. భారీ ట్రాఫిక్‌లో ఇరుకున్న భూమి చౌహాన్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఆ ఘటన గురించి తలుచుకుంటుంటే తన శరీరం ఇంకా వణుకుతోందని, విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని తెలిపింది. పది నిమిషాల ఆలస్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం చేరుకున్న చౌహాన్ విమానం ఎక్కడాన్ని మిస్ చేసుకుంది. మధ్యాహ్నం 1.30 గంటకు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. 1.38 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే కుప్పకూలింది.

