Sat Apr 04 2026 02:33:56 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్...బంగారం ధరలు పెరగలేదు
ప్రస్తుతం హైదాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,600 రూపాయలుగా ఉంది.

కరోనా కాని, ఇంకేదైనా కాని బంగారం కొనుగోలు చేయడానికి ఏదీ అడ్డం రాదు. కరోనా సమయంలో బంగారం ధరలు పెరిగినా విక్రయాలు ఏమాత్రం తగ్గలేదు. అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నా, ఒక్క బంగారం మాత్రం కరోనా సమయంలోనూ నిలదొక్కుకుంది. పైగా ఆ సమయంలో కరోనా ధరలు పెరిగాయి. బంగారానికి ఉన్న విలువ అలాంటిది మరి. ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈరోజు స్థిరంగా....
మరోసారి కరోనా విజృంభిస్తుందన్న తరుణంలో బంగారం ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలోనే బంగారాన్ని కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,650 రూపాయలుగా ఉంది.
Next Story

