Sun Mar 15 2026 18:03:37 GMT+0530 (India Standard Time)
అయ్యప్ప దర్శన వేళల్లో మార్పు
శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శన వేళలను ఆలయ కమిటీ మార్చింది. భక్తుల రద్దీ పెరగడంతోమార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు

అయ్యప్ప స్వామి దర్శన వేళలను ఆలయ కమిటీ మార్చింది. భక్తుల రద్దీ పెరగడంతో సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. శబరిమలలో ఇప్పటి వరకూ ఉదయం మూడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకూ అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరచి ఉంచుతున్నారు.
రాత్రి 11 గంటల వరకే...
అయితే భక్తుల రద్దీ పెరగడం, కరోనా ఆంక్షలు కూడా ఎత్తివేయడంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అయ్యప్ప స్వామి దర్శనం లభిస్తుంది. ఈ నెల 16 నుంచి అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని తెరిచారు. ఇప్పటివరకూ మూడు లక్షలకు మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ తెలిపింది.
Next Story

