Wed Jan 21 2026 04:10:50 GMT+0000 (Coordinated Universal Time)
Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలోకి దూసుకెళ్లాలని తెలుగు వ్యక్తుల ప్రయత్నం
ముంబైలో రిలయన్స్ అధినేత, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ

ముంబైలో రిలయన్స్ అధినేత, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల హై ప్రొఫైల్ వివాహ వేదిక లోకి చొరబడాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆహ్వానం లేకుండా స్టార్-స్టడెడ్ వివాహ కార్యక్రమంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన నిందితులలో ఒకరు యూట్యూబర్ వెంకటేష్ నరసయ్య (26) కాగా.. మరొక వ్యక్తి మహ్మద్ షఫీ షేక్ (28). తనను తాను వ్యాపారవేత్తగా షఫీ చెప్పుకున్నాడు. వీరిద్దరూ ఈ ఈవెంట్‌ను చూసేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి ముంబైకి వచ్చారని, వారిపై సపరేట్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వెంకటేష్, మహ్మద్ షఫీ షేక్ ఇద్దరూ వివాహ కార్యక్రమం జరిగిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చారు. అనుమానం రావడంతో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. వారిని BKC పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారిపై కేసు నమోదు చేశామని ఒక అధికారి తెలిపారు.ఈ రెండు కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్న పోలీసులు నోటీసులిచ్చి వారిద్దరినీ విడుదల చేశారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ హోస్ట్ చేసిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Next Story

