Tue Mar 17 2026 18:51:57 GMT+0530 (India Standard Time)
ప్రధాని పై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్
ప్రధాని నరేంద్ర మోదీ పై తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ పై తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నోటీసులు అందించారు. రాజ్యసభ ఛైర్మన్ కు నోటీసులు అందజేశారు. పార్లమెంటు లో బిల్లు ఆమోదం పొంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని టీఆర్ఎస్ సభ్యులు నోటీసులో పేర్కొన్నారు.
వ్యాఖ్యలకు నిరసనగా....
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తలుపులు మూసేసి, పెప్పర్ స్స్రే చల్లి బిల్లులు ఆమోదించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి అన్యాయం జరిగిందని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘననేని టీఆర్ఎస్ పేర్కొంది.
Next Story

