Sun Mar 15 2026 10:54:52 GMT+0530 (India Standard Time)
Team India : భారత్ కు చేరుకున్న టీం ఇండియా
వెస్టిండీస్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న టీం ఇండియా ఈరోజు భారత్ కు చేరుకుంది

వెస్టిండీస్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న టీం ఇండియా ఈరోజు భారత్ కు చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో టీం ఇండియాకు క్రికెట్ ఫ్యాన్స్ పెద్దయెత్తున వచ్చి స్వాగతం పలికారు. అధికారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ విమానాశ్రయానికి తరలి వచ్చారు. ఈరోజు భారత్ ఆటగాళ్లు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రపంచ కప్ తో ముంబయిలో రోడ్ షో నిర్వహించనున్నారు.
ముంబయిలో ఊరేగింపు...
ఓపెన్ టాప్ బస్సులో ముంబయి బస్సులో ప్రధాన వీధుల్లో టీం ఇండియా బ్యాటర్లు ఊరేగింపు ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ఇందుకు తగిన ఏర్పాట్లను ముంబయి పోలీసులు చేస్తున్నారు. వరల్డ్ కప్ గెలుచుకున్నా అక్కడ తుపాను కారణంగా మూడు రోజుల పాటు భారత్ క్రికెటర్లు చిక్కుకుపోయారు. వారి కోసం ప్రత్యేక విమానం పంపి ఇండియాకు తీసుకు వచ్చారు.
Next Story

