Fri Dec 05 2025 16:22:15 GMT+0000 (Coordinated Universal Time)
Team India : ముంబయిలో గ్రాండ్ వెల్కమ్.. రహదారులన్నీ ఫ్యాన్స్ తో
టీం ఇండియా ముంబయికి చేరుకుంది.ఎయిర్ పోర్టు నుంచి వాంఖడే స్టేడియం వరకూ రహదారులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి

టీం ఇండియా ముంబయికి చేరుకుంది. మరికాసేపట్లో నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకూ ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీ నిర్వహించనుంది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీం ఇండియాకు ముంబయిలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎయిర్ పోర్టు నుంచి వాంఖడే స్టేడియం వరకూ రహదారులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ముంబయిలో జనసంద్రాన్ని తలపిస్తుంది. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఫ్యాన్స్ పెద్దయెత్తున టీం ఇండియా కు ఘన స్వాగతం పలికేందుకు తరలి వచ్చారు. రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు.
125 కోట్ల నజరానా...
వాంఖడే స్టేడియంలో టీం ఇండియా సభ్యులను బీసీసీఐ సన్నానం చేయనున్నారు. పదిహేడేళ్ల తర్వాత వెస్టిండీస్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బీసీసీఐ టీం ఇండియాకు 125 కోట్ల రూపాయలను నజరానాగా అందించనుంది. దీంతో పాటు అందరు క్రికెటర్లను సన్మానించనుంది. టీ20 వరల్డ్ కప్ గెలిచి ముంబయికి చేరుకున్న జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున ఫ్యాన్స్ తరలి రావడంతో రోడ్ షో కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.
Next Story

