Sun Mar 22 2026 09:35:33 GMT+0530 (India Standard Time)
Tamilnadu : అభ్యర్థికి చిలకజోస్యం చెప్పాడని వ్యక్తి అరెస్ట్
తంగర్ బచ్చన్ రోడ్డుపక్కన చిలుక జోస్యం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్లి జోస్యాన్ని చెప్పించుకున్నారు

తమిళనాడు కడలూరు నియోజకవర్గంలో విచిత్రమైన ఘటన జరిగింది. ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ కూటమిలోని పీఎంకే తరఫున తంగర్‌బచ్చన్ పోటీ చేస్తున్నారు. రెండు రోజుల కిందట ఆయన కడలూర్ తెన్నంబాక్కం ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో అక్కడ చిలకజోస్యం చెప్పే వ్యక్తి కనిపించాడు.
చిలకను బంధించారని...
వెంటనే అక్కడ ఆగిన తంగర్ బచ్చన్ రోడ్డుపక్కన చిలుక జోస్యం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్లి జోస్యాన్ని చెప్పించుకున్నారు. అయితే ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి ఆధారంగా తంగర్బచ్చన్కు చిలుక జోస్యం చెప్పిన సెల్వరాజ్‌ను వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. చిలుకను పంజరంలో బంధించడం వన్యప్రాణ సంరక్షణ చట్ట ప్రకారం నేరమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story

