Thu Mar 19 2026 00:47:48 GMT+0530 (India Standard Time)
రోడ్డుపై ఆగిన స్టాలిన్.. వెంటనే?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రోడ్డుపై తన కాన్వాయ్ ను ఆపి బాధితుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాను వెళుతున్న రహదారిపై ఆగారు. ఒక వాహనదారుడు ప్రమాదానికి గురి కావడంతో తన కాన్వాయ్ ను ఆపారు. బైక్ పై వెళుతున్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో గాయలపాలయ్యాడు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ తన కాన్వాయ్ ను ఆపి బాధితుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
ఆటోలో ఆసుపత్రికి....
బాధితుడి తలకు గాయాలు కావడంతో వెంటనే చికిత్స అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను స్టాలిన్ ఆదేశించారు. తన కాన్వాయ్ ఆపి సీఎం స్టాలిన్ దిగడంతో అక్కడ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బాధితుడి వెంట తన సెక్యూరిటీ గార్డును కూడా స్టాలిన్ ఆసుపత్రికి పంపారు.
Next Story

