Thu Mar 19 2026 08:50:31 GMT+0530 (India Standard Time)
RajaniKanth : రజనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపు డిశ్చార్జ్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం కుదుటపడిందని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం కుదుటపడిందని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అస్వస్థతతో గత నెల 30వ తేదీన రాజనీకాంత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో వైద్యులు స్టెంట్ వేశారు. వాస్తవానికి ఈరోజు రజనీకాంత్ డిశ్చార్జ్ కావాల్సి ఉంది.
స్టంట్ వేయడంతో...
అయితే వైద్యుల సూచన మేరకు మరో రోజు అబ్జర్వేషన్ లో ఉంచినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. రజనీకాంత్ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలంటూ ఫ్యాన్స్ పెద్దయెత్తున పూజలు చేస్తున్నారు.
Next Story

