Fri Dec 05 2025 22:51:19 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడు ప్రజలకు వరుణుడి షాక్... న్యూ ఇయర్ వేడుకలకు?
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి.

ఏడాది చివరి రోజు తమిళనాడు వాసులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. నూతన సంవత్సర వేడుకలకు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. దీనికి కారణం భారీ వర్షాలు. మరోసారి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. అధికారులు అప్రమత్తమయి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాల్లో రెడ్ అలర్ట్....
భారీ వర్షాలతో తమిళనాడు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చింగ్లెపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తమిళనాడు ప్రభుత్వం ఎక్కడికక్కడ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ భారీ వర్షాలపై సమీక్ష చేశారు.
Next Story

