Thu Mar 23 2023 10:50:22 GMT+0000 (Coordinated Universal Time)
వీడని వర్షాలు : స్కూళ్లకు సెలవులు
తమిళనాడును భారీ వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో ఇంకా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది

తమిళనాడును భారీ వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో ఇంకా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. చెన్నై నగరంతో పాటు ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఆరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్...
చెన్నై నగరంతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, ఊత్తుకోటలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకూ పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించింది. మాండూస్ తుపాను ప్రభావంతో చెన్నై నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు, ఈదురుగాలులకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టం అంచనాలు వేసే పనిలో పడింది. అందరికీ పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
Next Story