Sun Aug 07 2022 19:32:58 GMT+0000 (Coordinated Universal Time)
తమిళానాడులో మళ్లీ కరోనా కలకలం

తమిళనాడులో మళ్లీ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ పాజిటివిటీ రేటు పెరుగుతుంది. దీంత ప్రభుత్వం అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. నేటి నుంచి తమిళనాడు మాస్క్ తప్పనిసరి చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలను తూచా తప్పకుండా అమలు చేయాలంటూ అన్ని జిల్లాల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లు ధరించకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
కేసులు పెరుగుతుండటంతో...
నిన్న ఒక్కరోజునే 1,472 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలల్లో ఇది అత్యధిక సంఖ్యగా అధికారులు చెబుతున్నారు. కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందన్న వైద్యుల సూచనలను ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. పర్యాటక ప్రాంతాల్లోనూ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. తమిళనాడులో ఇప్పటి వరకూ 34,68,344 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 38,026 అని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం తమిళనాడులో 7,458 యాక్టివ్ కేసులున్నాయి. చెన్నై, చెంగల్పేట, కోయంబత్తూరులోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
Next Story