Wed Mar 18 2026 19:27:16 GMT+0530 (India Standard Time)
స్టాలిన్ దెబ్బకు దిగొచ్చిన గవర్నర్
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఎట్టకేలకు ఆమోదించారు.

ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధించడం మరియు ఇంటర్నెట్ గేమ్‌లను నియంత్రించడం కోసం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఎట్టకేలకు ఆమోదించారు. ఆరు నెలల పాటు పెండింగ్‌లో ఉంచిన బిల్లును చివరకు గవర్నర్ ఆమోదించారు.
బిల్లుకు ఆమోదం...
గవర్నర్ ఆర్ఎస్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన గంటల వ్యవధిలోనే ఆ బిల్లుని ఆమోదించడం విశేషం. గత నెలలో గవర్నర్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ బిల్లుని వెనక్కిపంపారు. దీంతో ప్రభుత్వం రెండోసారి బిల్లును ఆమోదించింది.
Next Story

