Sat Mar 07 2026 21:57:53 GMT+0530 (India Standard Time)
నేడు స్టాలిన్ అఖిలపక్ష భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా నీట్ పరీక్షపై తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించడం, బడ్జెట్ లో తమిళనాడుకు జరిగిన అన్యాయంపై స్టాలిన్ అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు.
గవర్నర్ పై.....
తమిళనాడులో గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాలను అమలు పర్చేందుకు గవర్నర్ అడ్డుపుల్లలు వేయడాన్ని స్టాలిన్ తప్పుపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులకు, వివిధ పక్షాల నేతలకు స్టాలిన్ లేఖ రాశారు. ఈరోజు జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా గవర్నర్ వైఖరిపైనే స్టాలిన్ అఖిలపక్ష నేతలతో చర్చించనున్నట్లు తెలిసింది.
Next Story

