Thu Mar 19 2026 00:47:40 GMT+0530 (India Standard Time)
కావేరి ఆసుపత్రిలో స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కావేరి ఆసుపత్రిలో చేరారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కావేరి ఆసుపత్రిలో చేరారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. కోవిడ్ అనంతరం సైడ్ ఎఫెక్ట్స్ రావడంతోనే స్టాలిన్ కావేరి ఆసుపత్రిలో చేరారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కు కరోనా అనంతరం కొంత ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన కావేరి ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండటంతో స్టాలిన్ కు కావేరి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్యంపై వైద్యులు..
అయితే స్టాలిన్ ఆరోగ్యం మెరుగుపడుతుందని కావేరి ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కోవిడ్ అనంతరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తాయని అధికారులు చెప్పారు.
Next Story

