Wed Jan 07 2026 06:06:29 GMT+0000 (Coordinated Universal Time)
బియ్యం, చక్కర, చెరకుగడ 3000 రూపాయలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి 3,000 రూపాయలు నగదు బహుమతిని ఇవ్వనున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి 3,000 రూపాయలు నగదు బహుమతిని ఇవ్వనున్నారు. బియ్యంకార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల నగదుతో పాటు ఒక కేజీ బియ్యం, ఒక కేజీ చక్కెర, ఒక చెరకుగడను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రజాపంపిణీ సేవా కేంద్రాల ద్వారా ఒక ధోతీ, ఒక చీర సైతం ఉచితంగా పంపిణీచేయనున్నారు. 2.22 కోట్ల రేషన్ కార్డు కుటుంబాలతోపాటు శ్రీలంక తమిళుల పునరావాస శిబిరాల్లోని కుటుంబాలు కూడా లబ్ది పొందనున్నాయి. దీనికి 6 వేల 936.17 కోట్లు ఖర్చు అవుతుందని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది.
Next Story

