Sat Mar 21 2026 12:41:19 GMT+0530 (India Standard Time)
నేడు మోదీతో స్టాలిన్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు

తమిళనాడు ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్న స్టాలిన్ తమిళనాడు హౌస్ లో బస చేశారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలను గురించి చర్చించనున్నారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు, జీఎస్టీ బకాయీలు, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు పెంచాలని స్టాలిన్ ఈ సందర్భంగా మోదీని కోరనున్నారు. వినతిపత్రాన్ని అంద చేయనున్నారు.
ఇద్దరినీ కలసి...
ఈరోజు ఉదయం 10.30 గంటలకు స్టాలిన్ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ను కలుస్తారు. 11.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. కొత్తగా ఎంపికైన ఇద్దరినీ అభినందిస్తారు. మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలను స్టాలిన్ ప్రస్తావించే అవకాశముంది. స్టాలిన్ ప్రధాని మోదీని కలసిన తర్వాత కొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి ఢిల్లీ నుంచి బయలుదేరి చెన్నైకు చేరుకుంటారు.
Next Story

