Thu Mar 19 2026 00:49:17 GMT+0530 (India Standard Time)
Vishal : పొలిటికల్ ఎంట్రీపై విశాల్ క్లారిటీ
తమిళ హీరో విశాల్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు

తమిళ హీరో విశాల్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. తాను ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టబోవడం లేదని చెప్పారు. తన రాజకీయ పార్టీపై జరుగుతున్నదంతా ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. తనకు ఆలోచన ప్రస్తుతానికి లేదని విశాల్ స్పష్టం చేశారు. తాను ఇప్పుడయితే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని అన్నారు.
సేవ చేస్తూ...
తాను సినిమా రంగానికే పరిమితమవుతానని తెలిపారు. సినీరంగంలో ఉంటూ సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నట్లు ఆయన వివరించారు. తాను ఇప్పటికే దేవీ ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నానని తెలిపిన విశాల్ అనేక మంది విద్యార్థులను తాను చదవిస్తున్నానని, రైతులను ఆదుకున్నానని చెప్పుకొచ్చారు. తాను లాభాలను ఆశించి ఏ పనిచేయనని ఆయన అన్నారు.
Next Story

