Thu Mar 19 2026 08:53:49 GMT+0530 (India Standard Time)
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దుచేసిన సుప్రీంకోర్టు
తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను రద్దు చేసిన సుప్రీం.. ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని..

న్యూ ఢిల్లీ : ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై నిన్న విచారణ చేసిన సుప్రీంకోర్టు.. నేటికి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను రద్దు చేసిన సుప్రీం.. ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్ పీని ధర్మాసనం తోసిపుచ్చింది. రెండేళ్ల తర్వాత కూడా సస్పెన్షన్ ను కొనసాగించడం కుదరదన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
Next Story

