Thu Dec 18 2025 10:13:21 GMT+0000 (Coordinated Universal Time)
బుల్డోజర్ కూల్చివేతలపై ఏమీ చేయలేం
యూపీ లో బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేత విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఉత్తర్ప్రదేశ్ లో బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేత విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివిధ నేరారోపణల్లో ఉన్నప్పుడు తాము ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది. అదే సమయంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను కూల్చి వేసే సమయంలో అధికారులు చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని అభిప్రాయపడింది.
మూడు రోజుల్లో...
ఉత్తర్ప్రదేశ్ లో నిందితుల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపి కూల్చి వేయడంపై సుప్రీంకోర్టులో కొందరు పిటీషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కూల్చివేస్తున్న సమయంలో అక్రమ నిర్మాణాలా? లేదా? అన్నది పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించింది.
Next Story

