Sat Mar 21 2026 23:16:17 GMT+0530 (India Standard Time)
అదానీ వ్యవహారంపై సుప్రీం కమిటీ
పారిశ్రామికవేత్త అదాని - హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని నిర్ణయించింది. ఇందుకు కమిటీ నియమించింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త అదాని - హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని నిర్ణయించింది. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో పలువురు సభ్యులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.
రెండు నెలల్లో...
అదాని - హిండెన్ బర్గ్ వ్యవహారంపై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ రెండు నెలల్లో ధర్మాసనానికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీల్డ్ కవర్ లో ఈ నివేదిక సమర్పించాలని కోరింది. కమిటీలో సభ్యులుగా వీరిని నియమించింది.
Next Story

