Sat Mar 07 2026 14:41:33 GMT+0530 (India Standard Time)
Omicron :ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఫస్ట్ వేవ్ కంటే ప్రమాదకరంగా ఉందన్నారు.

ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఫస్ట్ వేవ్ కంటే ఒమిక్రాన్ ప్రమాదకరంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫస్ట్ వేవ్ లో తనకు కరోనా సోకినా కేవలం నాలుగైదు రోజులే ఇబ్బంది పడ్డానని ఎన్వీ రమణ చెప్పారు. కానీ ఒమిక్రాన్ మాత్రం వదిలపెట్టకుండా ఇబ్బంది పెడుతుందని ఆయన చెప్పారు.
25 రోజుల నుంచి.....
తాను ఒమిక్రాన్ సోకి తగ్గినా 25 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నానని జస్టిస్ ఎన్వీరమణ తెలిపారు. కేసుల సంఖ్య దేశంలో ఇంకా పూర్తిగా తగ్గలేదని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Next Story

