Tue Jan 20 2026 03:10:57 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు ఆదేశించింది

తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు ఆదేశించింది. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ రాజకీయ ప్రచారంలో భాగంగా గత నెల 27వ తేదీన కరూర్ కు వెళ్లారు. అయితే అక్కడ తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయలయ్యాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. మద్రాస్ హైకోర్టు కూడా సిట్ తో దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు...
అయితే టీవీకే నేతలు ఈ తొక్కిసలాట ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు అందుకు సమ్మతించకపోవడంతో టీవీకే నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించింది దీంతో టీవీకే పార్టీకి ఊరట లభించినట్లయింది. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని కోరుకోవడంలో తప్పులేదని, అందుకే ఈ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Next Story

