Mon Mar 30 2026 08:51:12 GMT+0530 (India Standard Time)
సీఎంగా సుఖ్విందర్ ప్రమాణం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక మల్లికార్జున ఖర్గేలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది.
మంత్రివర్గ విస్తరణ...
ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీ అధినాయకత్వం సుఖ్విందర్ సింగ్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఎమ్మెల్యేలందరినీ సమన్వయం చేసుకుని వెళ్లాలని పార్టీ హైకమాండ్ సుఖ్విందర్ సింగ్ ను ఆదేశించింది. సామాజికవర్గాల పరంగా మంత్రివర్గ విస్తరణను త్వరలో చేపట్టనున్నారు.
- Tags
- sukhwinder singh
Next Story

