Fri Dec 05 2025 17:40:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మాన్సాదేవి దేవాలయంలో తొక్కిసలాట... ఆరుగురు మృతి
హరిద్వార్ లోని మాన్సాదేవి దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి చెందారు

హరిద్వార్ లోని మాన్సాదేవి దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి చెందారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలు అయినట్లు సమాచారం. తొక్కిసలాట జరిగిన వెంటనే అక్కడ భక్తులతో పాటు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.
గాయపడిన వారిలో...
గాయపడిన భక్తులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే గాయపడిన వారిలో మరికొందరు పరిస్థితి ఎక్కువగా ఉందని తెలిసింది. తొక్కిసలాట జరిగినట్లు తెలిసిన వెంటనే అక్కడకు పోలీసులు, సహాయక బృందాలు చేరుకుని అక్కడ భక్తులు క్యూ లైన్ లో వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

